Pages

Wednesday, May 30, 2012

Day 151 - 300512 - ఐ - ఐదువ


ఐ తో వచ్చే పదాల్లో నాకు ఐరావతం అనే పదం చాలా ఇష్టం. మా నాన్న నాకు పెట్టిన ముద్దు పేరది :) అమరావతి లో నందనవనం లో వుండే ఐరావతం యొక్క ఉపయోగం కంటే దాని maintanence ఖర్చు ఎక్కువట. నా వలన కూడా ఉపయోగాల కంటే నన్ను మేపడానికి అయే ఖర్చు  ఎక్కువని అలా పిలుస్తుంటారు :) కానీ ఆ ఐరావతాన్ని నా ఫోటో కోసం దివి నుండి భువికి దింప లేను కదా ;)

ఇంకేం ఫోటో తీయాలా అని dictionary లో గాలిస్తుంటే ఈ ఐదువ అనే పదం కనిపించింది. దీని అర్ధం పెళ్ళయి భర్త బ్రతికి వున్న స్త్రీ అని వుంది. అలాంటి స్త్రీ ని ముత్తైదువ అంటారని విన్నాను. కానీ ఐదువ అని కూడా అంటారట. ఐదువ అంటే ఐదు వన్నెలు కలది. అవి మాంగల్యము, పసుపు,కుంకుమ,గాజులు, చెవ్వాకు (చెవి పోగులు).

ఈ ఫోటోలో వున్నది నాకు తెల్సిన వాళ్ళలో అత్యంత పండు ఐదువ. పేరు రంగవ్వ. మా తాతయ్యని (అమ్మ వాళ్ళ నాన్న) చిన్నగా వున్నప్పుడు ఆడించేదిట . తర్వాత మా అమ్మని, తర్వాత నన్ను, ఇప్పుడు పండు గాడిని :) వయసు తొంబై ఐదు దాకా వుంటుంది. చక్కగా అన్ని పనులూ చేస్తుంది. ఈవిడ భర్త కూడా ఈమెలాగానే చాలా చలాకీగా వుంటారు. వీళ్ళిద్దరి జంట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందరి కంటే వృద్ధ జంట.

3 comments:

  1. monne nenu ila english alphabets tho friend blog raste chadiva.Ippudu telugu picture blog chustunna.Awesome

    ReplyDelete