Pages

Tuesday, January 31, 2012

Day 31 - 310112 - ఊరగాయలు, రోటి పచ్చళ్ళు


పుట్టిల్లు, అత్తగారిల్లు ఒకే ఊరిలో వుండటం వలన బోల్డన్ని ఉపయోగాలు వున్నాయి. వాటిలో ఒకటి అమ్మ, అత్తమ్మ చేసే రకరకాల పచ్చళ్ళు ఎప్పటికప్పుడు దొరుకుతుండటం. వారానికోసారి ఇద్దరూ చెరో రెండు పచ్చళ్ళు పంపిస్తారు. ఇక మనం పొద్దున్న టిఫిన్ లోకి అవే. కూరలు వండుకోడానికి బద్ధకించినప్పుడూ అవే. శనివారం మిగిలినవన్నీ పని మనిషి కి ఇచ్చేసి మళ్ళీ సోమవారం కొత్తవి తెచ్చుకోవడం. అమ్మ రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది (మినుములు, టొమాటో, అల్లం, గోంగూర వగైరా). అత్తమ్మ ఊరగాయలు, తొక్కులు బాగా చేస్తుంది (ఉసిరికాయ, చింతకాయ వగైరా). ఇవి కాకుండా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు పంపించేవి ఉండనే వుంటాయి. నేను ఒంటికి ఉప్పు ఎక్కువ పడుతుందని పచ్చళ్ళు ఎక్కువ తినను (టిఫిన్ లోకి తప్ప). కానీ మా అయన మాత్రం పండగ చేసుకుంటాడు. వండుకున్నవాడికి ఒక్క కూర, అడుక్కునే వాడికి 60 కూరలని ఊరికే అనలేదు మరి.

1 comment: