Pages

Wednesday, February 29, 2012

Day 60 - 290212 - గాజుల మేళం


ఈ మధ్య ఒక రోజు పండు గాడిని వాళ్ళ నాన్నకి అప్పచెప్పి నేనో పెళ్ళికి వెళ్లాను. వాడితో పెళ్ళికి వెళ్ళాలంటే ఇన్ని గాజులేసుకోలేను. వాడు లేదు కదా అని రెచ్చిపోయి ఇవన్నీ తగిలించాను ఆ రోజు :)

Day 59 - 280212 - సరదాగా ఇలా..



అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వీడి అల్లరి తట్టుకోలేక సరదాగా ఇలా కట్టేశాం. ముందు ఎంజాయ్ చేసాడు కానీ తర్వాత గోల చేసాడు తీయమని..తీసేసాం :)

Day 58 - 270212 - పసుపచ్చ గులాబీ


Day 57 - 260212 - నల్లపూసలు


పది రోజుల క్రితం ఇంట్లో ఉన్న ఇద్దరు పురుష పుంగవుల మీద నాకు పీకల్దాకా కోపం వచ్చేసింది. రిటైల్ థెరపి ద్వారా తగ్గించుకున్నాను. ఆ క్రమంలో నా పర్స్ కి పెద్ద చిల్లే పడింది. అప్పుడు కొన్నవాటిలో ఇవి ఒకటి.

Day 56 - 250212 - సెలెక్షన్స్



ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు కదా. ఇప్పుడు అర్ధమవుతోంది అందులో మొదటి పని ఎంత కష్టమో. ఎక్కువ భాగం మా ఆయనే చూసుకుంటున్నా సెలక్షన్ విషయానికొచ్చేసరికి నా సలహా అడుగుతాడు. పోనీ నేనేం చెప్తే అదే ఫైనల్ చేస్తారా అంటే లేదు..నేనో పది designs సెలెక్ట్ చేయాలి, అమ్మ ఒక పది, నాన్న ఒక పది, తను ఒక పది చేస్తే ఆఖరికి ఆ నలభయ్ designs లో మామా అల్లుడు ఒక ఐదింటిని సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ ఇంకో రౌండ్ ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఒక్కటి approve చేస్తారు. ఇప్పుడు వుడ్ వర్క్ కోసం మైకా షీట్స్ సెలెక్ట్ చేస్తున్నాం.

Day 55 - 240212 - కొత్త రంగులు



ఒకప్పుడు గోళ్ళ రంగు అంటే నా దృష్టిలో ఎరుపు,గులాబీ,మెరూన్ రంగులు మాత్రమే. కాకపోతే వీటిలో రక రకాల షేడ్స్ కొనేదాన్ని. అయితే ఈ మధ్య సిల్వర్, బ్రాంజ్ కలర్స్ ట్రై చేద్దామనిపించి కొత్తవి కొన్నాను. వాటితో పాటు బ్లూ కూడా తీసుకున్నాను.

Day 54 - 230212 - కార్మికులు


Day 53 - 220212 - తొలి పొద్దు


పికాస లో ఏమిటేమిటో ఆప్షన్స్ వాడి ఎడిట్ చేస్తే ఇలా వచ్చింది :)

Day 52 - 210212 - కళ్యాణ కొట్టం


అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని మండువా లోగిలి. అయితే పైన ఓపెన్ గా కాకుండా క్లోజ్ చేసేసారు.

Monday, February 20, 2012

Day 51 - 200212 - ప్రకాశం బ్యారేజ్



ఈ రోజు ఫోటోలు తీయలేదు. పోయిన నెలలో విజయవాడ వెళ్ళినప్పుడు కృష్ణ మీద పడవలో నుండి తీసిన ఫోటో ఇది.

Day 50 - 190212 - Fruit Carving


ఒక రిసెప్షన్ కి వెళ్తే అక్కడ పళ్లన్నీ ఇలా పెట్టారు. దగ్గరకెళ్ళి తీసి వుండాల్సింది ఫోటో. కానీ మొహమాటమేసి వెళ్ళలేదు :(

Day 49 - 180212 - అల్పాహారం



ఈ రోజు నా బ్రేక్-ఫాస్ట్ ఇది. అంటే పండు గాడికి ఇంట్లో ఒకటి, బ్రేక్-బాక్స్ లోకి ఒకటి చెయ్యాలి కదా. అలా చేయగా నాకు మిగిలినవి ఇవీ :) అంతే కానీ నేనేదో ఆరోగ్యం కోసం ఇలా వండుకు తింటున్నాను అనుకోకండి :)

Day 48 - 170212 - చాకి రేవు



ప్రతి గురు-శుక్రవారాల్లో మా ఇంట్లో చాకిరేవు పెడుతున్నాను. మా ఊర్లో ఇస్త్రీ రేట్ లు అదిరిపోతున్నాయి (ఆ మాటకొస్తే అన్ని రేట్ లు ఎక్కువే). ఈ మధ్యనే విజయవాడ నుండి relocate అయి మా ఊరోచ్చిన చుట్టాలు 'ఈ ఊరు లో ఎలా బ్రతుకుతున్నారు' అని అడిగారు :( నా ఒక్క కాటన్ డ్రెస్ ఇస్త్రీ చేయించాలంటే 10rs , పండు గాడి జతకి 5rs ఇలా వుంటాయి. మా అయన బట్టలు, బెడ్ షీట్స్ ఎలాగూ నేను ఇస్త్రీ చేయలేను. అందుకే నా బట్టలు, పండు గాడి బట్టలు వారానికోసారి ఇలా ఇస్త్రీ చేసుకుంటున్నా. కాటన్ చుడిదార్స్ కి మా మేరీ గంజి పెట్టిస్తే నేను ఐరన్ చేసుకుంటా. ప్రతి రోజూ ఇంట్లో వేసుకునే డ్రెస్ కి కూడా ఉండాల్సిందే (మరీ సిల్క్ అయితే తప్ప). ఇలా నేనే ఐరన్ చేసుకుంటే నెలకి ఒక రెందొందలయినా ఆదా అవుతాయి. ఈ విషయం మా ఆయనకి చెప్తే విసుక్కుంటాడు. నువ్వు ఇందులో చేసే పొదుపు ఏ మూలకీ రాదు, మళ్ళీ ఈ పనంతా చేస్తున్నట్టు, నువ్వేదో భలే కష్టపడిపోతున్నట్టూ అందరి ముందు బిల్డ్ అప్ లు ఇవ్వడం ఒకటీ అని. అయితే దీని వెనక పొదుపు కంటే కూడా వేరే ఒక కారణం వుంది.ఎలానూ జిమ్ లో చేరడం, వాకింగ్ కి వెళ్ళడం ఇవన్నీ నాకు బద్ధకం. ఇంటి పనుల్లో అయినా కొంచెం ఒళ్ళు వంచి కష్టపడితే తినే రాక్షస తిండి కి న్యాయం చేసిన దాన్ని అవుతాను అని ఒక చిన్న ప్రయత్నం అంతే. కానీ ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి చెప్తే నా పొదుపు గురించి హేళన చేస్తారు. అందుకే వాళ్ళందరికీ ఖర్చులు తగ్గిస్తున్నా అంటూ బిల్డ్ అప్ ఇస్తుంటా :)

Thursday, February 16, 2012

Day 47 - 160212 - Symmetry


తెలుగులో symmetry ని ఏమంటారో?

ఈ రోజే ఊర్నుండి వచ్చాను. అందుకే బోల్డన్ని ఫోటోలు ఒకే సారి పోస్ట్ చెయ్యాల్సి వచ్చింది. ఇంకా చదివిన పుస్తకాలన్నిటి గురించీ కూడా రాయాలి. ఎప్పటికి అవుతుందో?

Day 46 - 150212 - హమారా బజాజ్


మా చిన్నప్పుడు నాన్నకి ఇలాంటి బండి వుండేది (లైట్ గ్రీన్ కలర్ ది). అప్పట్లో నాన్న, అమ్మ, నేను, తేజ నలుగురం ఈ బండి మీద ఎక్కి సినిమాలకి, షికార్లకి తిరిగేవాళ్ళం. లక్ష్మి పెద్ది వాళ్ళింట్లో ఈ పాత బండి (పెదనాన్న బ్రతికి వున్నప్పుడు వాడే వారు) ని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మదిలో మెదిలాయి.

Day 45 - 140212 - గులాబీలు


లక్ష్మి పెద్ది వాళ్ళ ఇంట్లోని గులాబి చెట్టు.

Day 44 - 130212 - ఎరక్కపోయి దూరానూ, ఇరుక్కు పోయానూ..



ఈ రోజు మధ్యాహ్నం నేను షుష్టుగా భోంచేసి మల్లెమాల గారి 'ఇదీ నా కథ' చదువుకుంటూ వున్నాను వసారా లో పడుకుని. పండు గాడు పక్కనే ఆడుకుంటూ వున్నాడు. చాలా సేపు ఏ శబ్దం వినిపించకపోఎసరికి అయ్యగారు ఏ ఘనకార్యం చేస్తున్నారా అని చూస్తే ఇదిగో ఇలా కుర్చీ కింద దూరిపోయి దాన్ని పైకెత్తుకుని బయటకి రాలేక నానా అవస్థ పడుతూ కనిపించాడు. పాపం వెళ్లి లేపుదామా అనుకుని కూడా చూద్దాం ఏం చేస్తాడో, నన్ను పిలుస్తాడో లేదో అని వెయిట్ చేసాను. ఆఖరికి తనే మెల్లగా పాములా పాక్కుంటూ బయటకి వచ్చేసి 'నేనోచ్చేషా' అంటూ గంతులేసాడు.

Day 43 - 120212 - కోడి వేపుడు



ఊర్లో మా వాళ్ళ ఇంట్లో ఈ రోజు కార్యకర్తలకి లంచ్ ఉండింది. వంటలు చేస్తుండగా తీసిన ఫోటో ఇది.

Day 42 - 110212 - నింగిని తాకేలా..



ఈ ఫోటో మా ఆయనకి చూపిస్తే నన్ను చంపి పాతరేసేయ్యగలడు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లాం ఈ రోజు. అక్కడ మేడ మీదకెక్కాము ఆడుకోడానికి. నా పుత్ర రత్నమేమో 'అమ్మా, పైకెక్కి షూస్తా , నే షూస్తా' అంటూ గోల. నేను ఎంత వద్దని మొత్తుకున్నా వినలేదు. ఇక  మా ఖాదర్ మస్తాన్ (పొలం చూసుకునే అతను) ని పట్టుకోమని చెప్పి ఎక్కించాము. నాకయితే గుండెకాయ గొంతులోకి వచ్చేసింది ఆ కొంచెం సేపట్లో. ఈ ఫోటో మా అక్క కూతురు తీసింది.

Day 41 - 100212 - పండు గాడి బ్రంచ్



రాగి పిండి - మినపప్పు - పాలకూర - కేరట్ తురుము తో గుంట పొంగనాలు. అయ్యగారు ఇవన్నీ తినరు. పక్కన పిల్లలతో షేర్ చేసుకుంటాడని కొంచెం ఎక్కువ పెడుతుంటాను.

Day 40 - 090212 - నిర్మానుష్యం



ఈ మధ్య ఒక రోజు పండు గాడు ఒకటే పేచీ పెడుతుంటే రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాను (వాడికి రైలన్నా, రైల్వే ప్లాట్ ఫారం అన్నా, రైల్వే గేటు అన్నా చాలా ఇష్టం, ప్రోక్లైనేర్ తర్వాతే అనుకోండి). అక్కడ తీసిన ఫోటో ఇది.

ఈ రోజు మా ఇంట్లో పని చేసే ఎబీనా మేడం గారు రాలేదు. బండెడు అంట్లు తోమి, బట్టలుతికి, ఇల్లు ఊడ్చి తుడిచేసరికి నా ఒళ్ళు హూనం అయింది. ఫోటోలు ఏమీ తీయలేదు :(

Wednesday, February 8, 2012

Day 39 - 080212 - ఇసుకలో ఆటలు


మా ఇంటి పక్కన ఒక కొత్త ఇల్లు కడుతున్నారు..వాళ్ళో బండెడు ఇసుక తెచ్చి పడేసారు. ఇక నా పుత్రరత్నం సాయంత్రం నిద్ర లేవగానే పాలు తాగేసి వాడి బుల్లి బుల్లి బొమ్మ vehicles అన్నీ ఒక సంచిలో వేసుకుని వీధిలో కనిపించిన పిల్లలందరినీ 'అన్నా/పాపా రా, పోక్కలైనేరు ఇష్క తోవ్వేద్దాం' అని పిల్చి ఇసుకలో కూలేసి ఒకటే ఆటలు. ఆరు గంటలకి సదరు పిల్లల తల్లులు వచ్చి వాళ్ళని ట్యూషన్స్ కి తరిమితే అప్పుడు వీడు ఒంటి నిండా, తల నిండా ఇసుక పోసుకుని ఇంటికి బయల్దేరతాడు (అదీ నేను దోమలోస్తాయ్ , పాములోస్తాయ్ అని భయపెడితే అయిష్టంగా కదుల్తాడు). వాడినీ, ఇసుక తో నిండిన బొమ్మలనీ ప్రక్షాళనం గావించేసరికి నా తల ప్రాణం తోకకి వస్తోంది :((

Day 38 - 070212 - నేలకూలిన పచ్చదనం


మొక్కలు నాటి పెంచకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని ఇలా నరికేస్తే నాకు చాలా బాధగా అనిపించింది...అది కూడా ఒక మనిషి మీద కోపాన్ని ఇలా చెట్ల మీద తీర్చుకోవడం దారుణం కదా..పొలం సరిహద్దు తగాదాల్లో కనిపించిన దృశ్యం ఇది :(

గమనిక : ఈ ఫోటో మా అయన తీసినది :)

Monday, February 6, 2012

Day 37 - 060212 - సాగర్ కుడి కాలువ


ఈ ఫోటో పోయిన నెలలో గుంటూరు వెళ్ళినప్పుడు మాచర్ల దగ్గర తీసినది.

Day 36 - 050212 - కొత్త ఆట

 
ఈ మధ్య సైకిల్ మీద ఎక్కి ఇలా లాక్కెళ్ళమని ఒకటే గోల :)

Saturday, February 4, 2012

Day 35 - 040212 - చికెన్ lollypop



నేను ఇప్పటివరకూ తిన్న చికెన్ స్నాక్స్ అన్నిటిలోకీ నాకు బాగా నచ్చినది ఇదే. ఇవి తిన్నాక ఇక తర్వాత ఏమీ తినలేకపోయాను. ఆర్డర్ చేసిన బిర్యాని మొత్తం పార్సెల్ చేయించి ఇంటికి తెచ్చేసాం. రాత్రికి అదే తినాలి

Friday, February 3, 2012

Day 34 - 030212 - టీవీ కేబినెట్


ఈ మధ్య తెల్సిన వాళ్ళలో ఎవరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారని విన్నా, వాళ్ళ ఇంటికి వెళ్లి ఇల్లంతా ఫోటోలు తీసుకుని వస్తున్నా మా కొత్త ఫ్లాట్ కి పనికొచ్చే డిజైన్ ఏమన్నాఉంటుందేమో అని.

Thursday, February 2, 2012

Day 33 - 020212 - ధ్వజస్థంభం



ఫోటోలో వైర్ లేకుండా ఉండి వుంటే బాగుండేది అనిపించింది.

Wednesday, February 1, 2012

Day 32 - 010212 - ప్రొక్లైనర్



నా పుత్ర రత్నానికి  ప్రొక్లైనర్  అంటే ఎంత పిచ్చో చెప్పక్కర్లేదు. రోడ్ మీద వెళ్తుంటే అది కనిపిస్తే ఇక కార్ ఆపెయ్యాల్సిందే.వాడికి ఏదో కథ చెప్పి మనసు మళ్ళించి లాక్కుపోవాలి. ఇలా రోడ్ బ్లాక్ చేసేసి పని చేస్తుంటే ఇక వాడి ఆనందం వర్ణనాతీతం. ఎటూ కదలలేని పరిస్థితుల్లో వాడు ఎంజాయ్ చేస్తుంటే మేము గోళ్ళు గిల్లుకుంటూ చూస్తూ కూర్చున్నాం.