Pages

Thursday, June 28, 2012

Day 180 - 280612 - ఫ - ఫలహారము


మసాలా వడలు (మా ఊరి స్పెషల్ - చుట్టాలొస్తే ఇవి ఉండాల్సిందే..మామూలు గారెలకి మినప్పప్పు నాలుగయిదు గంటలు నానపెట్టాలి కదా, దీనికయితే పచ్చి సెనగపప్పు వాడతారు, అరగంట నానితే చాలు..అందుకే త్వరగా అయిపోతుంది)

Wednesday, June 27, 2012

Day 179 - 270612 - ప - పరివారము



సకుటుంబ సపరివార సమేతం (నాన్న, ఆయన అన్నదమ్ములు, వారి వారి కుటుంబాలు- కొందరు మిస్సింగ్
) - 2007 నాటి సంక్రాంతి కి నాన్న సొంతూరు అయిన ఆళ్లగడ్డ దగ్గరి పల్లెటూరులోని ఇంట్లో తీయించుకున్న ఫోటో

Tuesday, June 26, 2012

Day 178 - 260612 - న - నవారు మంచం


Day 177 - 250612 - ధ - ధర


Day 176 - 240612 - ద - దస్తావేజులు


Day 175 - 230612 - థ - రథము


Day 174 - 220612 - త - తరంగిణి


తరంగిణి అంటే నది అని అర్ధం.

Day 173 - 210612 - ణ - భరిణ



'ణ' తో మొదలయ్యే పదాలు ఏవీ తెలీదు నాకు..అందుకే ఈ పదం వాడి ఫోటో పోస్ట్ చేస్తున్నా.

Day 172 - 200612 - ఢ - ఢంకా



ఢంకా నేనెక్కడి నుండి తీసుకురానూ? అందుకే నా చేతివాటం చూపించా :)

Monday, June 18, 2012

Day 170 - 180612 - ఠ - ఠావు


వత్తు ట (ఠ) తో మొదలయ్యే పదాలు ఏమీ తెలీలేదు, అందుకని ఆ వత్తు ట (ఠ) కి ఒక దీర్ఘం ఇస్తే 'ఠా' అయ్యి దాంతో  ఠావు వస్తుంది కాబట్టి అది పోస్ట్ చేస్తున్నా :) చిన్నప్పుడు స్కూల్ లో త్రైమాసిక, అర్ధ సంవత్సర (quarterly, half-yearly) పరీక్షలకి ఎవరి  ఠావు లు వాళ్ళే తెచ్చుకోవాలి అని చెప్పేవారు. అప్పుడు కొనుక్కునేవాళ్ళం ఇవి. ఒక్కోటి పావలా వుండేది. ఇప్పుడసలు అమ్ముతున్నారో లేదో?

Day 169 - 170612 - ట - టపా


Day 168 - 160612 - ఞ - జ్ఞాపకాలు


ఈ 'ఞ' అనే అక్షరం వత్తులలో వాడతారు. ఉదాహరణకి సంజ్ఞ, విజ్ఞానము, ప్రజ్ఞ, జ్ఞాపకాలు ఇలాంటి పదాల్లో అన్నమాట.

Day 167 - 150612 - ఝ - ఝరి


ఈ ఫోటో ఎప్పుడో అయిదేళ్ళ క్రితం UK లో ఒక సారి ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు తీసినది. ఝరి అంటే జలపాతం (Info from telugu dictionary)

Day 166 - 140612 - జ (రెండవది) - జల్లెడ







ఇది కూడా తెలుగులో టైపు చెయ్యడం రాక అక్షరమాల చార్ట్ నుండి కాపీ చేసాను.

Day 165 - 130612 - జ - జంతువు


Day 164 - 120612 - ఛ - ఛత్రము


Day 163 - 110612 - చ (రెండవది) - చాప







ఈ రెండో చ ని translation సాఫ్ట్ వేర్ వాడి తెలుగులో టైపు చెయ్యడం రాలేదు :( తెలుగు అక్షరమాల చార్ట్ లో ఉన్న దాన్ని కాపీ చేసి ఇక్కడ అతికిస్తున్నాను. ఈ అక్షరం ప్రస్తుతం అక్షరమాల లో లేకపోయినప్పటికీ వాడుక లో అయితే వుంది. 'చ' ని పలికే విధానం లో తేడా వుంటుంది.

Day 162 - 100612 - చ - చక్రము


Day 161 - 090612 - ఙ - :(


ఈ అక్షరం వత్తులలో వాడతారనుకుంటా..కానీ నాకొక్క పదమూ కనిపించలేదు.

Day 160 - 080612 - ఘ - ఘటం


సంగీత కళాకారులు మట్టి తో చేసిన కుండని బోర్లించి దాని మీద చేత్తో వాయిస్తారు కదా, అలాంటి మట్టి కుండని
ఘటం అంటారు. నాకేమో కొంచెం శుభ్రంగా ఉన్న మట్టి కుండ (ఘటం) దొరకలేదు మరి :( ఇక ఈ పిచ్చి తుక్కు కుండ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Day 159 - 070612 - గ - గడియారము


Day 158 - 060612 - ఖ - ఖర్జూరాలు


ఎండాకాలం లో ఈ ఎండు ఖర్జూరాల్ని నీళ్ళలో నానపెట్టి ఆ నీటిని పండు గాడి చేత తాగిద్దామని ఎంత ప్రయత్నించానో, కానీ వాడు అస్సలు ఇష్టపడలేదు :(

Day 157 - 050612 - క - కడలి


హమ్మయ్య..వచ్చేసానోచ్! గత రెండు వారాల నుండి ఊపిరి సలపని పనులతో నెట్ ఓపెన్ చేయడం కుదరలేదు. ఈ రెండు మూడు నెలలు కూడా ఇలానే బిజీ బిజీ గానే వుంటాను..ఎలాగోలా ఈ రోజు కొంచెం టైం కుదుర్చుకున్నాను ఈ ఫోటోలు పోస్ట్ చేయడానికి..

Monday, June 4, 2012

Day 156 - 040612 - అః - అంతఃపురం

 
అః తో మొదలయ్యే అక్షరాలు ఏమీ లేవనుకుంటాను. ఇలా పదాల మధ్యలోనే వస్తుందని ఈ పదం తో ఫోటో పోస్ట్ చేస్తున్నాను. ఇందులో వున్నది నిజమయిన అంతఃపురం కాదు కానీ నా దృష్టిలో మాత్రం ఇదో అంతఃపురం (ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంతకు ముందు నా వేరే బ్లాగ్స్ లో ఈ ఇంటి ఫోటోలు పోస్ట్ చేసాను..కానీ ఇప్పుడిక వేరేవి లేక పాత ఫోటో నే పోస్ట్ చేసేస్తున్నా)

Friday, June 1, 2012

Day 153 - 010612 - ఓ - ఓణి


ఈ వారమంత నాకు క్షణం తీరిక ఉండట్లేదు..వచ్చే వారంలో ఇంట్లో ఫంక్షన్ వుంది..ఆ ఏర్పాట్లలో తలమునకలయి వున్నాను... ఓ అక్షరం తో పదాలు ఏమీ తట్టలేదు...ఈ 'ఓణి' అనే పదంలో 'వో' అని వాడతారేమో అనుకున్నా, కానీ dictionary లో ఓణి  అనే వుంది...నా archived ఫోటోలలో ఈ ఫోటో కనిపించింది...సూట్ అవుతుంది కదా అని పోస్ట్ చేస్తున్నా..

ఆడపిల్లలు లంగా ఓణి లు వేసుకుంటే నాకు భలే నచ్చుతారు. అవి వేసుకునే వయసులో నా personality కి అసలు నప్పేవి కావు, అందుకే ఆ మోజు తీర్చుకోలేకపోయాను (వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు నేను లంగా ఓణి లు వేసుకున్న రోజులు) :(