Pages

Tuesday, January 31, 2012

Day 31 - 310112 - ఊరగాయలు, రోటి పచ్చళ్ళు


పుట్టిల్లు, అత్తగారిల్లు ఒకే ఊరిలో వుండటం వలన బోల్డన్ని ఉపయోగాలు వున్నాయి. వాటిలో ఒకటి అమ్మ, అత్తమ్మ చేసే రకరకాల పచ్చళ్ళు ఎప్పటికప్పుడు దొరుకుతుండటం. వారానికోసారి ఇద్దరూ చెరో రెండు పచ్చళ్ళు పంపిస్తారు. ఇక మనం పొద్దున్న టిఫిన్ లోకి అవే. కూరలు వండుకోడానికి బద్ధకించినప్పుడూ అవే. శనివారం మిగిలినవన్నీ పని మనిషి కి ఇచ్చేసి మళ్ళీ సోమవారం కొత్తవి తెచ్చుకోవడం. అమ్మ రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది (మినుములు, టొమాటో, అల్లం, గోంగూర వగైరా). అత్తమ్మ ఊరగాయలు, తొక్కులు బాగా చేస్తుంది (ఉసిరికాయ, చింతకాయ వగైరా). ఇవి కాకుండా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు పంపించేవి ఉండనే వుంటాయి. నేను ఒంటికి ఉప్పు ఎక్కువ పడుతుందని పచ్చళ్ళు ఎక్కువ తినను (టిఫిన్ లోకి తప్ప). కానీ మా అయన మాత్రం పండగ చేసుకుంటాడు. వండుకున్నవాడికి ఒక్క కూర, అడుక్కునే వాడికి 60 కూరలని ఊరికే అనలేదు మరి.

Monday, January 30, 2012

Day 30 - 300112 - ఉత్సవ్ లో ఆన్ లైన్ షాపింగ్


'కుక్క తోక వంకర' అన్న సామెత తెలుసు కదా, నేను కుక్కని కాకపోయినా, నాకు తోక లేకపోయినా ఈ సామెత నాకు బాగా వర్తిస్తుంది అన్న విషయం ఈ రోజు ఇంకో సారి నిరూపించబడింది. నా గోడు ఎక్కడో ఒక చోట చెప్పుకోవాలి :(

Day 29 - 290112 - ప్రశాంత కుటీరం


ఊరికి దూరంగా కొండా కోనల నడుమ ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమం ఎంతో నచ్చింది నాకు. లోపల ఫోటోలు తీయడానికి అనుమతించలేదు.

Day 28 - 280112 - కాగితం పువ్వులు


ఎప్పుడూ గులాబి, ఎరుపు, నారింజ రంగుల్లో చూస్తుంటాను ఇలాంటి పువ్వులను. ఈ సారి లేత వంగపండు రంగులో భలే బాగున్నాయనిపించి ఫోటో తీసేసాను.

Saturday, January 28, 2012

Day 27 - 270112 - గోరింటాకు (Colored Mehendi)


మాఘ మాసం మొదలయింది కదా, ఇక ఒకటే functions . ఒక ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఈ రంగుల రంగుల mehendi పెడుతుంటే నేనూ పెట్టించుకున్నా.

Day 26 - 260112 - హిమ క్రీములు


ఈ మధ్య గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. అన్నిటికంటే ఎక్కువ ఐస్ క్రీం ఏ కప్ లో వుంటే అది నాది :)

Thursday, January 26, 2012

Day 25 - 250112 - చేపల పులుసు


 బయట ఊర్ల నుండి మా ఊరికి ఎవరయినా చుట్టాలొస్తే ఈ కూర వండి పెట్టకుండా పంపించం :)

Tuesday, January 24, 2012

Day 24 - 240112 - హాయ్ ల్యాండ్ లో రిసార్ట్స్



పడవ ఆకారంలో ఉన్న ఈ రిసార్ట్స్ యొక్క  కట్టుబడి, అందులో చూపిన శ్రద్ధ నాకెంతో నచ్చాయి.

Day 23 - 230112 - బ్రతుకు పోరాటం



కృష్ణ లో మేము boat - cruise  లో ప్రయాణిస్తుండగా చాలా మంది జాలర్లు ఇలా చేపలు పడుతూ కనిపించారు.

Day 22 - 220112 - హాయ్ ల్యాండ్ లో ట్రీ-హౌస్


ప్రశాంతమయిన రిసార్ట్స్,  థీమ్ పార్క్ లో వాటర్ గేమ్స్, రైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నాన్న, అమ్మ వాళ్ళ వాళ్ళ స్నేహితులతో సరదాగా గడుపుతుంటే మేమంతా వాటర్ గేమ్స్, రైడ్స్ తో ఎంజాయ్ చేసాము.

Monday, January 23, 2012

Day 21 - 210112 - నాన్నగారి సహ విద్యార్ధులు


33  ఏళ్ళ క్రితం నాన్న చదువుకున్న మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధుల మీటింగ్ విజయవాడలో జరిగింది. చాలా మంది కుటుంబ సమేతంగా వచ్చారు.చాలా బాగా ఎంజాయ్ చేసారు. మాకు (కుటుంబ సభ్యులకు) బోర్ కొట్టకుండా బోల్డన్ని కార్యక్రమాలు arrange చేసారు.

Day 20 - 200112 - ఎన్నెన్నో వర్ణాలు


Thursday, January 19, 2012

Day 19 - 190112 - కండలేరు జలాశయం



మేము మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళాము కానీ పొద్దున్నో, సాయంత్రమో అయితే ఇంకా మంచి వ్యూ కనిపించేది. మళ్ళీ ఒక సారి ఇక్కడికి వెళ్ళాలి తీరిగ్గా.

Wednesday, January 18, 2012

Day 18 - 180112 - భాషా దోషాలు


కండలేరు జలాశయం చూడటానికి వెళ్తే అక్కడ ఈ వివరాలున్న బోర్డు నిండా తప్పులే. తెలుగుకి తెగులు రావడం అంటే ఇదే. సామర్ధ్యం, పొడవు,అట్టడుగు ఇలాంటి పదాలు ఎవరు రాసారో కానీ తప్పుగా రాసారు. ఎంతో ముఖ్యమయిన ఇలాంటి విషయం ఎందుకు పట్టించుకోరో మరి?

Day 17 - 170112 - కలువ పువ్వులు



పెంచల కోన వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆశ్రమం లోని కొలనులో ఈ కలువ పువ్వులు వున్నాయి. చాలా రోజులకి చూసాను.

Day 16 - 160112 - అమ్మమ్మ


పెద్ది మా అమ్మమ్మ ఫోటోలు కొన్ని సేకరించి ఇలా తయారు చేయించింది.

Day 15 - 150112 - సంక్రాంతి ముగ్గు



చిన్నప్పుడు చాలా ఓపిగ్గా ధనుర్మాసం అంతా పొద్దున్నే లేచి ముగ్గులు వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఓపిక లేక వెయ్యట్లేదు. ఈ ముగ్గు కూడా మా outhouse లో వుండే ఆవిడ వేసింది.

Day 14 - 140112 - భోగి మంటలు



నాకు ఊహ తెలిసాక మొట్ట మొదటి సారి భోగి మంట మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసుకోడం ఇదే. ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళ ఊరో, నానమ్మ వాళ్ళ ఊరో వెళ్తుంటాం. అవి రెండూ కాకపోతే నేను ఈ దేశంలో ఉండకుండా ఉన్న రోజులు అయి వుంటాయి.

Day 13 - 130112 - పెంచలకోన - నరసింహస్వామి ఆలయం



చుట్టూ కొండలు, కోనలు, జలపాతాలు..ప్రశాంతమయిన వాతావరణం లో వుండే ఈ ఆలయం నాకు చాలా ఇష్టం. పండు గాడి తో జలపాతం (ఇప్పుడు ఒకటే వుంది, కానీ మంచి వర్షా కాలం లో వెళ్తే మూడు, నాలుగు కనిపిస్తాయి) వరకూ నడిచి వెళ్ళే ఓపిక లేక దేవుడి దర్శనం చేసుకుని వచ్చేసాము. పదో తరగతి లో వుండగా ఇక్కడికి పిక్నిక్ కి వచ్చినప్పుడు మాత్రం ఆపసోపాలు పడుతూ చాలా దూరం నడిచి జలపాతం వరకూ వెళ్లి స్నానాలు చేసి వచ్చాము.

Day 12 – 120112 – మిరప చేను


గుంటూరు జిల్లా లో ఎక్కడ చూసినా కోతకి వచ్చిన పత్తి , మిరప చేలు కనిపించాయి. కోసిన కాయలన్నీ ఎండపెట్టి ఉంచారు పొలంలో..నిన్నంతా పడ్డ వానని తల్చుకుని బాధేసింది, ఆ పంటంతా ఏమయిపోతుందో అని. వ్యవసాయం అంత రిస్క్ ఉన్న profession ఇంకోటి లేదు అనిపిస్తుంది :(
రేపటి నుండి ఒక అయిదు రోజులు నేను బిజీ గా వుండబోతున్నాను. మళ్ళీ వచ్చే వారం నుండి update చేస్తా ఇక్కడ. బ్లాగ్మిత్రులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు :)

Day 11 – 110112 – కొత్త పుస్తకాలు




పోయిన శనివారం విజయవాడ బుక్ exhibition కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న పుస్తకాలు. ఇంగ్లీష్ నవలలలో కొన్నింటిని (సెకండ్ హ్యాండ్) డిస్కౌంట్ లో వంద కి నాలుగు చొప్పున కొన్నా :) పిల్లల కోసం బోల్డన్ని మంచి మంచి పుస్తకాలు వున్నాయి కానీ నాకు టైం లేక పండు గాడి కోసం ఎక్కువ కొనలేదు. నాకున్న ఆత్రం మూలాన Flipkart  లో ఎంతో తక్కువ ధరకి దొరికే పుస్తకాలు కొన్నిటిని MRP కి కొనేసాను..ఇంటికొచ్చాక చూసుకుని నాలుక కరుచుకున్నా :( ఏంటో హడావుడిగా కొనాల్సి వచ్చేసరికి బుర్ర పని చేయలేదు. వచ్చే ఏడాది నుండి జాగ్రత్త పడాలి.

Day 10 – 100112 – రౌడీ కోతి



ఈ రౌడీ కోతి మేము కోటప్పకొండ లో గుడి నుండి కొనుక్కొచ్చిన ప్రసాదం లడ్డూలను మా మీద పడి లాగేసుకుని తినేసింది. దాని వంక నిస్సహాయంగా , దీనంగా చూస్తూ వున్నది మా కజిన్ :P

Day 9 – 090112 – పల్నాటి బ్రహ్మ నాయుడు


గుంటూరు జిల్లా లోని మాచర్ల లో ఉన్న పల్నాటి బ్రహ్మ నాయుడు విగ్రహం. పల్నాడు ఏరియా అంతా ఒక రౌండ్ వేసి వచ్చాను. మరి కొన్ని ఫోటోలు ముందు ముందు పోస్ట్ చేస్తాను.

Day 8 – 080112 – కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం


గుంటూరు జిల్లా లోని కోటప్పకొండ కి వెళ్ళాము. చాలా బాగుంది. శివరాత్రి కి ఇక్కడ చాలా బాగా చేస్తారుట..ఎక్కడెక్కడి నుండో భక్తులు ప్రభలు కట్టుకుని వస్తారుట. నాకయితే ఈ ప్రదేశం చూస్తున్నంత సేపు ‘ప్రేమాభిషేకం’ సినిమా లోని పాట ‘కోటప్పకొండ కి వస్తానని మొక్కుకున్నా’ గుర్తొస్తూనే వుంది :D

Day 7 – 070112 – Book Fe(a)st


విజయవాడ లో జరిగిన బుక్ exhibition కి వెళ్లాను. ఎన్ని stalls వున్నాయో..తిరగలేక కాళ్ళు నొప్పెట్టాయి..ఒక్క రోజులో చేయగలిగే షాపింగ్ కాదు…ఒక వారం పాటు రోజూ రెండో మూడో గంటలు వెళ్లి తిరిగి, వెతుక్కుని కొనుక్కుంటే బాగుండేది..కానీ నాకు అలా కుదరదు కాబట్టి ఒకే రోజు వెళ్లి కొనుక్కొచ్చేసాను.

Day 6 – 060112 – Festival Shopping


పండు గాడి పండగ షాపింగ్ అయిపోయిందోచ్, చాలా షాప్స్ తిరగాల్సి వచ్చింది…నా బట్టలు మాత్రం చూసిన మొదటి షాప్ లోనే కొనేసుకున్నా. అదేంటో నా కోసం అయితే త్వరగా నచ్చేస్తాయి నాకు, పక్క వాళ్ళ కోసం షాపింగ్ అంటే మాత్రం గంటలు గంటలు పడుతుంది.

Day 5 - 050112 - Hankies


చేతి రుమాళ్ళకి కి కూడా గంజి పెట్టి ఇస్త్రీ చేస్తానని నాకు మా చెడ్డ పేరుంది :P ఎవరి చాదస్తం వాళ్ళది కదా :)

Day 4 - 040112 - Breakbox


ఇది మా పండు గాడి బ్రేక్ (స్నాక్) బాక్స్. పెట్టినవన్నీ తినడు..ఏది నచ్చితే అది తింటాడులే అని మూడు ఛాయిస్ లు ఇస్తుంటా :)

Day 3 – 030112 – తేగలు


తాటి కాయలని ముంజెలు తినేసాక భూమిలో పాతి పెడితే ఈ తేగలు వస్తాయిట.బోల్డంత fibre వుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచివట..ఇవి మా పొలంలో వచ్చిన తేగలు . కుంపట్లో కాల్చి తొక్క తీసి పంపించారు. నాకయితే ఉడికించినవి కూడా చాలా ఇష్టం.

Day 2 - 020112 - బెల్లప్పూస


మా ఊర్లో ఒక తెల్సినావిడ ఆర్డర్స్ తీసుకుని పిండివంటలు చేస్తూ వుంటుంది. ఆవిడ చేసే వాటిలో ఈ బెల్లప్పూస నాకు చాలా ఇష్టం.

Day 1 - 010112 - Hello 2012!


అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరి జీవితాల్లోనూ నిరుటి కంటే ఎక్కువ సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను.
పండు గాడి పక్కన ఉన్న ఆ  ఇద్దరు పిల్లలు మా అమ్మ వాళ్ళ అవుట్ హౌస్ లో వుండే వాళ్ళ పిల్లలు. ఈ రోజు పొద్దున్నే స్నానాలు చేయించేసుకుని కొత్త బట్టలు వేయించేసుకుని తయారయిపోయారు. ఈ రోజు వేరే ఏ
ఫోటోలు తీయలేదు. అందుకే ఇదే పోస్ట్ చేస్తున్నా :)

మొదటి టపా



రోజుకో ఫోటో (మార్చ్ 25 , 2012 వరకూ )పోస్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తో ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను . 2011 లో నేను పోస్ట్ చేసిన ఫోటోలు ఇక్కడ వున్నాయి. కొన్ని కారణాల వలన అక్కడ discontinue చేసి ఇక్కడ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. మార్చ్ 25 వరకూ రోజూ ఒక ఫోటో పోస్ట్ చేస్తాను (అప్పటికి నా ప్రాజెక్ట్ 365 ) పూర్తి అవుతుంది. ఇక ఆ తర్వాత నాకు ఫోటోలు  తీయాలనిపించినప్పుడు తీసి ఎప్పుడు వీలయితే అప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తూ వుంటాను. నాకు ఫొటోగ్రఫీలో ఓనమాలు రాక పోయినా ఫోటోలు తీయాలన్న ఆసక్తి మాత్రం చాలానే వుంది. అందుకే ఈ బ్లాగ్.

ఇక్కడ పండు గాడు అంటే నా పుత్ర రత్నం.

Comments are always welcome (I appreciate constructive criticism, but not destructive) :)