Saturday, April 28, 2012
Thursday, April 26, 2012
Day 115 - 240412 - Weekly dose of Greens
పండు గాడు పొట్టలో వున్నప్పుడు నా ఒంట్లో ఐరన్ లెవెల్స్ బాగా తగ్గాయి (8 - 9 కి అలా వచ్చేసాయి). అప్పుడు మా డాక్టర్ నాకు బాగా క్లాసు పీకింది. అప్పటి నుండి వారం లో కనీసం మూడు రోజులు ఆకు కూరలు తినడం మొదలుపెట్టాను. ఒకప్పుడు పాల కూర, తోట కూర తప్ప వేరేవి ఏవీ వండగలిగే దాన్ని కాదు, పేర్లు కూడా తెలిసేవి కావు..ఇప్పుడయితే పాల కూర, తోట కూర తో పాటు గోంగూర (ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర), చుక్క కూర, చిర్రి కూర, మెంతి కూర, పొన్నగంటి ఆకు, మొలగాకు, మునగాకు, అవిశాకు అబ్బో ఎన్నెన్ని తెల్సో నాకు :) మా అయన 'ఇలా ఆకులు తినీ తినీ మేకవయిపోతావు' అని ఎంత వెక్కిరించినా పట్టించుకోట్లేదు సరి కదా తనకీ, పండు గాడికి కూడా తప్పనిసరిగా తినిపిస్తున్నా. ఒంట్లో ఐరన్ శాతం బాగుంటే చాలా జబ్బులు రాకుండా వుంటాయిట.
Saturday, April 21, 2012
Friday, April 20, 2012
Day 111 - 200412 - Ad gimmicks
ఇంకో రెండు నెలలో స్కూల్స్ తెరిచే టైం అవుతుండటం తో కొత్త admissions కోసం రోజూ పేపర్స్ లో ఒకటే ads . ఇది చదివి నవ్వాపుకోలేకపోయాను (AC గురించిన మేటర్).
మా వాడిని స్కూల్ లో చేర్చడానికి పోయిన నవంబర్లో నాలుగయిదు స్కూల్స్ చూసాము. వాళ్ళు నా నంబర్ అడిగితే ఇచ్చాను. ఒక వారం నుండి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడగడం, బాబు ని మా స్కూల్ లో చేర్చండి, అవి వున్నాయి, ఇవి వున్నాయి, అవి చెప్తాం, ఇవి చెప్తాం అని. మేము ఏ స్కూల్ లో చేర్చాలో డిసైడ్ అయిపోయాము అని చెప్పి పెట్టేసా :) ఆ మధ్య ఒక కథలో పదో క్లాసు పిల్లలని తమ తమ colleges లో చేర్చడానికి కాలేజీ యాజమాన్యం వాళ్ళు PRO లని పెట్టుకుని ఇల్లిల్లూ తిప్పి offers ఎర చూపిస్తారని చదివాను . ఇప్పుడు ప్లే క్లాసు పిల్లలకి కూడా గాలం వేసేయ్యాలని చూసేస్తున్నారు :(
Thursday, April 19, 2012
Day 110 - 190412 - Lamp post
Tuesday, April 17, 2012
Monday, April 16, 2012
Day 107 - 160412 - కొత్త కారు
ఎట్టకేలకి మా నాన్న పన్నెండేళ్ళ తర్వాత కారు కొన్నారు. 2000 సంవత్సరం లో కొన్న మాటిజ్ తుక్కు తుక్కు అయినా సరే వదలకుండా పన్నెండేళ్ళు లాగించేసారు. ఇక అది మా పండు గాడికి ఆడుకునే బొమ్మ అయిపోయాక చేసేదేమీ లేక అమ్మేసి ఈ కొత్త కారు కొన్నారు. విన్న వాళ్ళందరూ "హమ్మయ్య, ఇన్నాళ్ళకి ఆ మాటిజ్ కి మోక్షం దక్కింది" అంటున్నారు :P
మరి మా జెన్ కి మోక్షం ఎప్పుడో? అన్నట్టు దీని వయసు ఎనిమిదేళ్ళు. మా మామగారు వాడుకున్నంత కాలం బాగుండింది.మా అయన చేతికొచ్చాక మాత్రం మర్యాద రామన్న సినిమా లో సునీల్ సైకిల్ పరిస్థితే దానిది. పాపం :(
Wednesday, April 11, 2012
Day 102 - 110412 - First batchmates
Saturday, April 7, 2012
Day 98 - 070412 - కొత్త పుస్తకాలు
అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే నేను చేసే పనేంటంటే పుస్తకాల అలమర తీసి కొత్త పుస్తకాలు ఏమొచ్చాయో చూడటం. పెద్దికి బోల్డన్ని బుక్స్ రివ్యూ కోసం ఇస్తుంటారు, అవన్నీ తను చదివేసి ఊరికి పంపిస్తుంది, అలా మన చేతికి చిక్కుతాయన్నమాట :) నేను జనవరి లో కొన్న పుస్తకాలు ఇంకా పూర్తి చెయ్యలేదు కానీ వీటి మీద పడిపోయాను ముందు. మన దగ్గర వుండే పుస్తకాలు ఎప్పుడయినా చదువుకోవచ్చు, వేరే వాళ్ళ పుస్తకాలు ముందు చదివేస్తే ఒక పని అయిపోతుంది కదా.
Friday, April 6, 2012
Wednesday, April 4, 2012
Day 95 - 040412 - మల్లెల మాల
Day 94 - 030412 - వెన్నెల్లో పడకలు
స్వచ్చమయిన గాలి పీలుస్తూ, వెన్నెల వెలుగులో ఆరుబయట పడుకుంటే ఆ మజానే వేరు. చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్య నన్ను అలా పడుకోబెట్టి కథలు చెప్పేవారు. ఇప్పుడు పండు గాడి వంతు :) చుక్కలని, చందమామ ని చూస్తూ నిద్రలోకి జారుకోవడం, గుడిలో నుండి మంద్రస్థాయిలో విన్పించే ఘంటసాల గారి భక్తి పాటలు వింటూ మేల్కుని, కళ్ళు తెరిచీ తెరవగానే పచ్చని కొబ్బరి చెట్టు ని చూడటం..స్వర్గం ఇంతకంటే బాగుంటుందా?
Day 92 - 010412 - భజన బ్యాచ్
అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి తిరణాల మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రెండు రోజులూ పక్క ఊరి నుండి భజన చేసే వాళ్ళని పిలిపిస్తారు. అప్పట్లో అయితే ఇరవయ్ ముప్పయ్ మంది వచ్చేవారు. ఇప్పుడు అయిదారుగురు కంటే ఎక్కువ మంది రావట్లేదు. వాళ్ళతో పాటు ఊర్లో పిల్లలు, యువకులు కల్సి చేస్తున్నారు. చిన్నప్పుడయితే వాళ్ళతో పాటు నేనూ గజ్జె కట్టి భజన చేసేదాన్ని :)
Subscribe to:
Posts (Atom)