ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు కదా. ఇప్పుడు అర్ధమవుతోంది అందులో మొదటి పని ఎంత కష్టమో. ఎక్కువ భాగం మా ఆయనే చూసుకుంటున్నా సెలక్షన్ విషయానికొచ్చేసరికి నా సలహా అడుగుతాడు. పోనీ నేనేం చెప్తే అదే ఫైనల్ చేస్తారా అంటే లేదు..నేనో పది designs సెలెక్ట్ చేయాలి, అమ్మ ఒక పది, నాన్న ఒక పది, తను ఒక పది చేస్తే ఆఖరికి ఆ నలభయ్ designs లో మామా అల్లుడు ఒక ఐదింటిని సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ ఇంకో రౌండ్ ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఒక్కటి approve చేస్తారు. ఇప్పుడు వుడ్ వర్క్ కోసం మైకా షీట్స్ సెలెక్ట్ చేస్తున్నాం.
No comments:
Post a Comment