Pages

Thursday, February 16, 2012

Day 44 - 130212 - ఎరక్కపోయి దూరానూ, ఇరుక్కు పోయానూ..



ఈ రోజు మధ్యాహ్నం నేను షుష్టుగా భోంచేసి మల్లెమాల గారి 'ఇదీ నా కథ' చదువుకుంటూ వున్నాను వసారా లో పడుకుని. పండు గాడు పక్కనే ఆడుకుంటూ వున్నాడు. చాలా సేపు ఏ శబ్దం వినిపించకపోఎసరికి అయ్యగారు ఏ ఘనకార్యం చేస్తున్నారా అని చూస్తే ఇదిగో ఇలా కుర్చీ కింద దూరిపోయి దాన్ని పైకెత్తుకుని బయటకి రాలేక నానా అవస్థ పడుతూ కనిపించాడు. పాపం వెళ్లి లేపుదామా అనుకుని కూడా చూద్దాం ఏం చేస్తాడో, నన్ను పిలుస్తాడో లేదో అని వెయిట్ చేసాను. ఆఖరికి తనే మెల్లగా పాములా పాక్కుంటూ బయటకి వచ్చేసి 'నేనోచ్చేషా' అంటూ గంతులేసాడు.

1 comment: