Wednesday, February 29, 2012
Day 59 - 280212 - సరదాగా ఇలా..
Day 56 - 250212 - సెలెక్షన్స్
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు కదా. ఇప్పుడు అర్ధమవుతోంది అందులో మొదటి పని ఎంత కష్టమో. ఎక్కువ భాగం మా ఆయనే చూసుకుంటున్నా సెలక్షన్ విషయానికొచ్చేసరికి నా సలహా అడుగుతాడు. పోనీ నేనేం చెప్తే అదే ఫైనల్ చేస్తారా అంటే లేదు..నేనో పది designs సెలెక్ట్ చేయాలి, అమ్మ ఒక పది, నాన్న ఒక పది, తను ఒక పది చేస్తే ఆఖరికి ఆ నలభయ్ designs లో మామా అల్లుడు ఒక ఐదింటిని సెలెక్ట్ చేసి అందులో మళ్ళీ ఇంకో రౌండ్ ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఒక్కటి approve చేస్తారు. ఇప్పుడు వుడ్ వర్క్ కోసం మైకా షీట్స్ సెలెక్ట్ చేస్తున్నాం.
Day 52 - 210212 - కళ్యాణ కొట్టం
Monday, February 20, 2012
Day 51 - 200212 - ప్రకాశం బ్యారేజ్
Day 50 - 190212 - Fruit Carving
Day 48 - 170212 - చాకి రేవు
ప్రతి గురు-శుక్రవారాల్లో మా ఇంట్లో చాకిరేవు పెడుతున్నాను. మా ఊర్లో ఇస్త్రీ రేట్ లు అదిరిపోతున్నాయి (ఆ మాటకొస్తే అన్ని రేట్ లు ఎక్కువే). ఈ మధ్యనే విజయవాడ నుండి relocate అయి మా ఊరోచ్చిన చుట్టాలు 'ఈ ఊరు లో ఎలా బ్రతుకుతున్నారు' అని అడిగారు :( నా ఒక్క కాటన్ డ్రెస్ ఇస్త్రీ చేయించాలంటే 10rs , పండు గాడి జతకి 5rs ఇలా వుంటాయి. మా అయన బట్టలు, బెడ్ షీట్స్ ఎలాగూ నేను ఇస్త్రీ చేయలేను. అందుకే నా బట్టలు, పండు గాడి బట్టలు వారానికోసారి ఇలా ఇస్త్రీ చేసుకుంటున్నా. కాటన్ చుడిదార్స్ కి మా మేరీ గంజి పెట్టిస్తే నేను ఐరన్ చేసుకుంటా. ప్రతి రోజూ ఇంట్లో వేసుకునే డ్రెస్ కి కూడా ఉండాల్సిందే (మరీ సిల్క్ అయితే తప్ప). ఇలా నేనే ఐరన్ చేసుకుంటే నెలకి ఒక రెందొందలయినా ఆదా అవుతాయి. ఈ విషయం మా ఆయనకి చెప్తే విసుక్కుంటాడు. నువ్వు ఇందులో చేసే పొదుపు ఏ మూలకీ రాదు, మళ్ళీ ఈ పనంతా చేస్తున్నట్టు, నువ్వేదో భలే కష్టపడిపోతున్నట్టూ అందరి ముందు బిల్డ్ అప్ లు ఇవ్వడం ఒకటీ అని. అయితే దీని వెనక పొదుపు కంటే కూడా వేరే ఒక కారణం వుంది.ఎలానూ జిమ్ లో చేరడం, వాకింగ్ కి వెళ్ళడం ఇవన్నీ నాకు బద్ధకం. ఇంటి పనుల్లో అయినా కొంచెం ఒళ్ళు వంచి కష్టపడితే తినే రాక్షస తిండి కి న్యాయం చేసిన దాన్ని అవుతాను అని ఒక చిన్న ప్రయత్నం అంతే. కానీ ఈ విషయం మా ఇంట్లో వాళ్లకి చెప్తే నా పొదుపు గురించి హేళన చేస్తారు. అందుకే వాళ్ళందరికీ ఖర్చులు తగ్గిస్తున్నా అంటూ బిల్డ్ అప్ ఇస్తుంటా :)
Thursday, February 16, 2012
Day 47 - 160212 - Symmetry
Day 44 - 130212 - ఎరక్కపోయి దూరానూ, ఇరుక్కు పోయానూ..
ఈ రోజు మధ్యాహ్నం నేను షుష్టుగా భోంచేసి మల్లెమాల గారి 'ఇదీ నా కథ' చదువుకుంటూ వున్నాను వసారా లో పడుకుని. పండు గాడు పక్కనే ఆడుకుంటూ వున్నాడు. చాలా సేపు ఏ శబ్దం వినిపించకపోఎసరికి అయ్యగారు ఏ ఘనకార్యం చేస్తున్నారా అని చూస్తే ఇదిగో ఇలా కుర్చీ కింద దూరిపోయి దాన్ని పైకెత్తుకుని బయటకి రాలేక నానా అవస్థ పడుతూ కనిపించాడు. పాపం వెళ్లి లేపుదామా అనుకుని కూడా చూద్దాం ఏం చేస్తాడో, నన్ను పిలుస్తాడో లేదో అని వెయిట్ చేసాను. ఆఖరికి తనే మెల్లగా పాములా పాక్కుంటూ బయటకి వచ్చేసి 'నేనోచ్చేషా' అంటూ గంతులేసాడు.
Day 42 - 110212 - నింగిని తాకేలా..
ఈ ఫోటో మా ఆయనకి చూపిస్తే నన్ను చంపి పాతరేసేయ్యగలడు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లాం ఈ రోజు. అక్కడ మేడ మీదకెక్కాము ఆడుకోడానికి. నా పుత్ర రత్నమేమో 'అమ్మా, పైకెక్కి షూస్తా , నే షూస్తా' అంటూ గోల. నేను ఎంత వద్దని మొత్తుకున్నా వినలేదు. ఇక మా ఖాదర్ మస్తాన్ (పొలం చూసుకునే అతను) ని పట్టుకోమని చెప్పి ఎక్కించాము. నాకయితే గుండెకాయ గొంతులోకి వచ్చేసింది ఆ కొంచెం సేపట్లో. ఈ ఫోటో మా అక్క కూతురు తీసింది.
Day 40 - 090212 - నిర్మానుష్యం
ఈ మధ్య ఒక రోజు పండు గాడు ఒకటే పేచీ పెడుతుంటే రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాను (వాడికి రైలన్నా, రైల్వే ప్లాట్ ఫారం అన్నా, రైల్వే గేటు అన్నా చాలా ఇష్టం, ప్రోక్లైనేర్ తర్వాతే అనుకోండి). అక్కడ తీసిన ఫోటో ఇది.
ఈ రోజు మా ఇంట్లో పని చేసే ఎబీనా మేడం గారు రాలేదు. బండెడు అంట్లు తోమి, బట్టలుతికి, ఇల్లు ఊడ్చి తుడిచేసరికి నా ఒళ్ళు హూనం అయింది. ఫోటోలు ఏమీ తీయలేదు :(
Wednesday, February 8, 2012
Day 39 - 080212 - ఇసుకలో ఆటలు
మా ఇంటి పక్కన ఒక కొత్త ఇల్లు కడుతున్నారు..వాళ్ళో బండెడు ఇసుక తెచ్చి పడేసారు. ఇక నా పుత్రరత్నం సాయంత్రం నిద్ర లేవగానే పాలు తాగేసి వాడి బుల్లి బుల్లి బొమ్మ vehicles అన్నీ ఒక సంచిలో వేసుకుని వీధిలో కనిపించిన పిల్లలందరినీ 'అన్నా/పాపా రా, పోక్కలైనేరు ఇష్క తోవ్వేద్దాం' అని పిల్చి ఇసుకలో కూలేసి ఒకటే ఆటలు. ఆరు గంటలకి సదరు పిల్లల తల్లులు వచ్చి వాళ్ళని ట్యూషన్స్ కి తరిమితే అప్పుడు వీడు ఒంటి నిండా, తల నిండా ఇసుక పోసుకుని ఇంటికి బయల్దేరతాడు (అదీ నేను దోమలోస్తాయ్ , పాములోస్తాయ్ అని భయపెడితే అయిష్టంగా కదుల్తాడు). వాడినీ, ఇసుక తో నిండిన బొమ్మలనీ ప్రక్షాళనం గావించేసరికి నా తల ప్రాణం తోకకి వస్తోంది :((
Monday, February 6, 2012
Saturday, February 4, 2012
Day 35 - 040212 - చికెన్ lollypop
Friday, February 3, 2012
Thursday, February 2, 2012
Wednesday, February 1, 2012
Day 32 - 010212 - ప్రొక్లైనర్
నా పుత్ర రత్నానికి ప్రొక్లైనర్ అంటే ఎంత పిచ్చో చెప్పక్కర్లేదు. రోడ్ మీద వెళ్తుంటే అది కనిపిస్తే ఇక కార్ ఆపెయ్యాల్సిందే.వాడికి ఏదో కథ చెప్పి మనసు మళ్ళించి లాక్కుపోవాలి. ఇలా రోడ్ బ్లాక్ చేసేసి పని చేస్తుంటే ఇక వాడి ఆనందం వర్ణనాతీతం. ఎటూ కదలలేని పరిస్థితుల్లో వాడు ఎంజాయ్ చేస్తుంటే మేము గోళ్ళు గిల్లుకుంటూ చూస్తూ కూర్చున్నాం.
Subscribe to:
Posts (Atom)