పుట్టిల్లు, అత్తగారిల్లు ఒకే ఊరిలో వుండటం వలన బోల్డన్ని ఉపయోగాలు వున్నాయి. వాటిలో ఒకటి అమ్మ, అత్తమ్మ చేసే రకరకాల పచ్చళ్ళు ఎప్పటికప్పుడు దొరుకుతుండటం. వారానికోసారి ఇద్దరూ చెరో రెండు పచ్చళ్ళు పంపిస్తారు. ఇక మనం పొద్దున్న టిఫిన్ లోకి అవే. కూరలు వండుకోడానికి బద్ధకించినప్పుడూ అవే. శనివారం మిగిలినవన్నీ పని మనిషి కి ఇచ్చేసి మళ్ళీ సోమవారం కొత్తవి తెచ్చుకోవడం. అమ్మ రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తుంది (మినుములు, టొమాటో, అల్లం, గోంగూర వగైరా). అత్తమ్మ ఊరగాయలు, తొక్కులు బాగా చేస్తుంది (ఉసిరికాయ, చింతకాయ వగైరా). ఇవి కాకుండా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు పంపించేవి ఉండనే వుంటాయి. నేను ఒంటికి ఉప్పు ఎక్కువ పడుతుందని పచ్చళ్ళు ఎక్కువ తినను (టిఫిన్ లోకి తప్ప). కానీ మా అయన మాత్రం పండగ చేసుకుంటాడు. వండుకున్నవాడికి ఒక్క కూర, అడుక్కునే వాడికి 60 కూరలని ఊరికే అనలేదు మరి.
Tuesday, January 31, 2012
Day 31 - 310112 - ఊరగాయలు, రోటి పచ్చళ్ళు

Monday, January 30, 2012
Saturday, January 28, 2012
Thursday, January 26, 2012
Tuesday, January 24, 2012
Monday, January 23, 2012
Day 21 - 210112 - నాన్నగారి సహ విద్యార్ధులు
Thursday, January 19, 2012
Wednesday, January 18, 2012
Day 18 - 180112 - భాషా దోషాలు
Day 15 - 150112 - సంక్రాంతి ముగ్గు
Day 13 - 130112 - పెంచలకోన - నరసింహస్వామి ఆలయం
చుట్టూ కొండలు, కోనలు, జలపాతాలు..ప్రశాంతమయిన వాతావరణం లో వుండే ఈ ఆలయం నాకు చాలా ఇష్టం. పండు గాడి తో జలపాతం (ఇప్పుడు ఒకటే వుంది, కానీ మంచి వర్షా కాలం లో వెళ్తే మూడు, నాలుగు కనిపిస్తాయి) వరకూ నడిచి వెళ్ళే ఓపిక లేక దేవుడి దర్శనం చేసుకుని వచ్చేసాము. పదో తరగతి లో వుండగా ఇక్కడికి పిక్నిక్ కి వచ్చినప్పుడు మాత్రం ఆపసోపాలు పడుతూ చాలా దూరం నడిచి జలపాతం వరకూ వెళ్లి స్నానాలు చేసి వచ్చాము.
Day 12 – 120112 – మిరప చేను
గుంటూరు జిల్లా లో ఎక్కడ చూసినా కోతకి వచ్చిన పత్తి , మిరప చేలు కనిపించాయి. కోసిన కాయలన్నీ ఎండపెట్టి ఉంచారు పొలంలో..నిన్నంతా పడ్డ వానని తల్చుకుని బాధేసింది, ఆ పంటంతా ఏమయిపోతుందో అని. వ్యవసాయం అంత రిస్క్ ఉన్న profession ఇంకోటి లేదు అనిపిస్తుంది

రేపటి నుండి ఒక అయిదు రోజులు నేను బిజీ గా వుండబోతున్నాను. మళ్ళీ వచ్చే వారం నుండి update చేస్తా ఇక్కడ. బ్లాగ్మిత్రులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు

Day 11 – 110112 – కొత్త పుస్తకాలు
పోయిన శనివారం విజయవాడ బుక్ exhibition కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న పుస్తకాలు. ఇంగ్లీష్ నవలలలో కొన్నింటిని (సెకండ్ హ్యాండ్) డిస్కౌంట్ లో వంద కి నాలుగు చొప్పున కొన్నా

Day 10 – 100112 – రౌడీ కోతి
Day 9 – 090112 – పల్నాటి బ్రహ్మ నాయుడు
Day 8 – 080112 – కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం
Day 7 – 070112 – Book Fe(a)st
Day 1 - 010112 - Hello 2012!
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరి జీవితాల్లోనూ నిరుటి కంటే ఎక్కువ సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను.
పండు గాడి పక్కన ఉన్న ఆ ఇద్దరు పిల్లలు మా అమ్మ వాళ్ళ అవుట్ హౌస్ లో వుండే వాళ్ళ పిల్లలు. ఈ రోజు పొద్దున్నే స్నానాలు చేయించేసుకుని కొత్త బట్టలు వేయించేసుకుని తయారయిపోయారు. ఈ రోజు వేరే ఏ
ఫోటోలు తీయలేదు. అందుకే ఇదే పోస్ట్ చేస్తున్నా

మొదటి టపా
రోజుకో ఫోటో (మార్చ్ 25 , 2012 వరకూ )పోస్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తో ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను . 2011 లో నేను పోస్ట్ చేసిన ఫోటోలు ఇక్కడ వున్నాయి. కొన్ని కారణాల వలన అక్కడ discontinue చేసి ఇక్కడ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. మార్చ్ 25 వరకూ రోజూ ఒక ఫోటో పోస్ట్ చేస్తాను (అప్పటికి నా ప్రాజెక్ట్ 365 ) పూర్తి అవుతుంది. ఇక ఆ తర్వాత నాకు ఫోటోలు తీయాలనిపించినప్పుడు తీసి ఎప్పుడు వీలయితే అప్పుడు ఇక్కడ పోస్ట్ చేస్తూ వుంటాను. నాకు ఫొటోగ్రఫీలో ఓనమాలు రాక పోయినా ఫోటోలు తీయాలన్న ఆసక్తి మాత్రం చాలానే వుంది. అందుకే ఈ బ్లాగ్.
ఇక్కడ పండు గాడు అంటే నా పుత్ర రత్నం.
Comments are always welcome (I appreciate constructive criticism, but not destructive) :)
Subscribe to:
Posts (Atom)