Pages

Saturday, May 5, 2012

Day 125 - 040512 - లాన్


రూఫ్ పైన లాన్ వేసుకోవడం సిటీల్లో ఎప్పుడూ చూస్తూనే వున్నా కానీ మా ఊర్లో ఎప్పుడూ చూడలేదు ఈ రోజుటి వరకూ. చూడటానికి బాగానే వుంది కానీ maintain  చెయ్యాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అసలే పని మనుషులు దొరకని కాలం ఇది. అమ్మ వాళ్ళింట్లో గార్డెన్ లో వేసి కూడా maintain చెయ్యలేక పీకించేసారు :( పొద్దున్నే లాన్ లో ఉత్తి కాళ్ళతో నడుస్తుంటే రాత్రి కురిసిన మంచు అరికాళ్ళలో గిలిగింతలు పెట్టే ఆ ఫీలింగ్ నాకెంతో ఇష్టం :) ఈ లాన్ చూడగానే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి.

Day 124 - 030512 - Smileeeee!



మా వాడు ఈ మధ్య కెమెరా అందితే చాలు, అందరి వెంటా పడుతూ "Smileeeee " అంటూ తెగ ఫోటోలు తీస్తున్నాడు.

Day 123 - 020512 - షష్టిపూర్తి



ఈ రోజు మా పెదనాన్న (అమ్మ కజిన్) అరవయ్యో పుట్టినరోజు. పాపం కాలు విరిగి బెడ్ మీద వున్నారు. అయినా సరే వదలకుండా కేకు కట్ చేయించి చిన్న పార్టీ చేసుకున్నాము :)

Day 122 - 010512 - At the Exhibition


Day 121 - 30041212 - New set



మా వాడికి ప్రొక్లైనర్ అంటే ఎంత పిచ్చో చాలా సార్లు చెప్పాను కదా..ఎన్ని వున్నా ఇంకా అడుగుతూనే ఉంటాడు. వాడి ఇష్టం గమనించి మా ఇంటికి ఎవరు వచ్చినా, వాడి కోసం ఏం తెచ్చినా అందులో ఈ ప్రొక్లైనర్ తప్పకుండా వుంటుంది. దానితో పాటు తెచ్చిన బుల్లి మిల్లర్, బుల్లి ట్రక్ చూడముచ్చటగా అనిపించాయి :)

Day 120 - 290412 - Relishing every bit of it :)



ఈ రోజు రాత్రి తొమ్మిదింటి కి మా అయన ఊరు నుండి వస్తూ ఈ తాటి కాయలు (ముంజెలు) తెచ్చిచ్చాడు. మా ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళతో కబుర్లు చెప్తూ అవి వెంటనే తినడానికి తీరలేదు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి పన్నెండింటికి నేనూ, మా కజిన్ కూర్చుని లాగించేసాము :) ఆ ముందున్నవన్నీ నేను ఖాళీ చేసినవే ;)

Day 119 - 280412 - ఉప్పాడ చీర

 
ఉప్పాడ చీర కొనుక్కోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. అమ్మని అడిగితే అవి పెద్ద వాళ్ళు (ఆమె age  వాళ్ళు) కట్టుకునే చీరలు, నీకెందుకు అని తీసిపారేసింది. అవునేమోలే అని నేనూ చాలా రోజులు ఊరుకున్నాను. కానీ మా ఆర్కుట్ ఫ్రెండ్స్ అందరూ "ఏం కాదు, మన వయస్సు వాళ్లకి కూడా వుంటాయి" అని చెప్తే ఇక గోల చేసి అమ్మని ఒప్పించి షాపింగ్ కి తీసుకెళ్ళాను. ఎక్కువ శ్రమ పడకుండానే నాకు నచ్చిన చీర దొరికేసింది. కొనేసుకున్నానోచ్!