Pages

Wednesday, May 30, 2012

Day 151 - 300512 - ఐ - ఐదువ


ఐ తో వచ్చే పదాల్లో నాకు ఐరావతం అనే పదం చాలా ఇష్టం. మా నాన్న నాకు పెట్టిన ముద్దు పేరది :) అమరావతి లో నందనవనం లో వుండే ఐరావతం యొక్క ఉపయోగం కంటే దాని maintanence ఖర్చు ఎక్కువట. నా వలన కూడా ఉపయోగాల కంటే నన్ను మేపడానికి అయే ఖర్చు  ఎక్కువని అలా పిలుస్తుంటారు :) కానీ ఆ ఐరావతాన్ని నా ఫోటో కోసం దివి నుండి భువికి దింప లేను కదా ;)

ఇంకేం ఫోటో తీయాలా అని dictionary లో గాలిస్తుంటే ఈ ఐదువ అనే పదం కనిపించింది. దీని అర్ధం పెళ్ళయి భర్త బ్రతికి వున్న స్త్రీ అని వుంది. అలాంటి స్త్రీ ని ముత్తైదువ అంటారని విన్నాను. కానీ ఐదువ అని కూడా అంటారట. ఐదువ అంటే ఐదు వన్నెలు కలది. అవి మాంగల్యము, పసుపు,కుంకుమ,గాజులు, చెవ్వాకు (చెవి పోగులు).

ఈ ఫోటోలో వున్నది నాకు తెల్సిన వాళ్ళలో అత్యంత పండు ఐదువ. పేరు రంగవ్వ. మా తాతయ్యని (అమ్మ వాళ్ళ నాన్న) చిన్నగా వున్నప్పుడు ఆడించేదిట . తర్వాత మా అమ్మని, తర్వాత నన్ను, ఇప్పుడు పండు గాడిని :) వయసు తొంబై ఐదు దాకా వుంటుంది. చక్కగా అన్ని పనులూ చేస్తుంది. ఈవిడ భర్త కూడా ఈమెలాగానే చాలా చలాకీగా వుంటారు. వీళ్ళిద్దరి జంట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అందరి కంటే వృద్ధ జంట.

Sunday, May 27, 2012

Day 148 - 270512 - ఌ, ౡ (అలు, అలూ) - డైనోసార్ అక్షరాలు


అంటే ఇవి అంతరించిన రాక్షస బల్లుల్లా అంతరించిన అక్షరాలన్నమాట. వికీపీడియా లో వెతికితే కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది వీటి గురించి. ఇవి సంస్కృతం అచ్చులలో ఉన్నవట. ఒకప్పుడు తెలుగు వర్ణమాల లో భాగం గా ఉండేవట కానీ కాలక్రమేణా వీటి వాడుక మూల పడింది అని రాసారు. 
ఉదాహరణకి 'క్లుప్తం' అనే పదంలో 'క' కి కొమ్ము ఇచ్చి 'ల' వత్తు ఇచ్చి రాస్తాము కదా, కానీ పూర్వం అయితే 'క' కి 'ఌ' ని వత్తు గా ఇచ్చి రాసేవారట.

ముందయితే నాకీ అక్షరాలు ఉన్నట్టే గుర్తు లేదు. నేను లిస్టు రాసుకునేటప్పుడు చక్కగా స్కిప్ చేసేసాను. కానీ సుష్మ లిస్టు లో చూసాక ఎక్కడో బల్బ్ వెలిగింది. తనని అడిగితే అవీ అచ్చులలో భాగమే అని చెప్పింది. చిన్నప్పుడు చదువుకున్నాను కానీ తర్వాత మర్చిపోయాను. ఇప్పుడు ఈ వికీపీడియా పుణ్యమా అని వాటి గురించి కొంత తెల్సుకున్నాను.

Saturday, May 26, 2012

Day 147 - 260512 - ౠ - ?


ఈ 'ౠ' అక్షరం తో పదాల కోసం ఎంత గాలించినా దొరకలేదు. Dictionary లో కూడా వెతికాను :(

ౠ (అరూ) అక్షరం తో మొదలయ్యే పదాలు గ్రాంధిక తెలుగులో ఏమన్నా వున్నాయేమో తెలీదు కానీ ప్రస్తుతం దీన్ని వాడుక తెలుగులో సుడి దీర్ఘం ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. అంటే క్రూరుడు, క్రూర మృగం ఇలాంటి పదాల్లో ర వత్తు కాకుండా (అంటే ఈ సాఫ్ వేర్ లో సుడి దీర్ఘం translate అవట్లేదు) ౠ తో సుడి దీర్ఘం ఇస్తున్నారు. ఈ క్రింద ఫోటో లో వుంది.




 కనుక క్రూరుడు, క్రూర మృగం లాంటి పదాలకి related గా ఫోటో తీసి పెట్టొచ్చు. కానీ ఈ జనారణ్యం లో క్రూర మృగాన్ని ఎక్కడ వెతికి పట్టుకోను? మహిషాసుర మర్ధిని ఫోటో వుంటే దానికి క్రూర సంహారం అని పెట్టి పోస్ట్ చేద్దామనుకున్నాము (ఇంకెవరూ - నేనూ, సుష్మ)..కానీ అలాంటి ఫోటో ఏదీ లేదు. నెట్ లో కాపీ చేసి పెట్టాల్సిందే. ఇలా నానా తంటాలు పడి నిన్న రాత్రి ఒకరి జుట్టు ఒకరం virtual గా పీకేసుకుని చివరికి ఇలా పేపర్ మీదో, పలక మీదో రాసేసి మా confused & puzzled  expressions ని కూడా అతికించి పోస్ట్ చేసేద్దాం అని డిసైడ్ అయ్యాము.


ఈ పని చేస్తున్నప్పుడు మా అయన ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఇలా తెలుగు అక్షరమాల థీమ్ గా తీసుకుని ఫోటోలు తీస్తున్నా అని చెప్పాను . నీకసలు తెలుగు అక్షరాలు అన్నీ వచ్చా అని వెక్కిరించాడు. నాకు ఒళ్ళు మండింది. పలక తన చేతికిచ్చి అచ్చులు అన్నీ మిస్ కాకుండా వ్రాయి అన్నాను. తను రాసిన అచ్చులు ఇవి,

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, అం, అః

నన్ను వెక్కిరించిందుకు తను మిస్ చేసిన ఒక్కో అక్షరానికి వంద ఫైన్ వేసి వసూలు చేశా..హన్నా..హన్నన్నా..అసలే రెండక్షరాలు మిస్ అయ్యాను (అలు, అలూ) అని నేను తెగ ఫీల్ అవుతుంటే (సుష్మ చెప్పేవరకూ గుర్తు రాలేదు ఈ రెండూ) నా జోలికొస్తాడా, తిక్క కుదిర్చాను బాగా :P