Pages

Wednesday, August 1, 2012

Day 211 - 290712 - Dubai shopping



నా స్నేహితురాలు ప్రణతి దుబాయ్ నుండి వస్తూ నాకోసం తెచ్చిన బహుమతులు :) పండు గాడి కోసం కూడా కొన్ని బొమ్మలు తెచ్చింది కానీ అవి అమ్మ వాళ్ళింట్లో ఉండిపోయాయి.నన్ను హైదరాబాద్ లో కలిసి ఇచ్చింది ఇవన్నీ.

Day 210 -280712 - Beyond Virtual


online లో పరిచయమయిన ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను ఈ రోజు. తనని మొదటి సారి చూస్తున్నాను, ముఖాముఖి మొదటి సారి కలిసాను అన్న ఫీలింగ్ ఎంత మాత్రం రాలేదు నాకు. పిల్లలిద్దరూ కూడా బాగా ఆడుకున్నారు :)

Day 209 - 270712 - కెనాల్ వర్క్



మా అయన చేయిస్తున్న కొత్త వర్క్ ఇది :)

Day 208 - 260712 - నీటి తిప్పలు


ఏంటో వర్షాలు పడ్డా కూడా నీటి ఎద్దడి ఇంకా ఉందిక్కడ. ఇలా ట్రాక్టర్స్ మీదో, బళ్ల మీదో తెప్పించుకునే వాళ్ళు కనిపిస్తూనే వున్నారు.

Day 207 - 250712 - అమ్మ కోసం



ఈ రోజు అమ్మ పుట్టినరోజు. ఎక్కువగా చీరలు కొనిచ్చే దాన్ని. ఈ సారెందుకో అవి బోర్ కొట్టి ఇది ఇచ్చాను.

Day 206 - 240712 - Junk


ఏంటో కొనేసాను కానీ పెట్టుకుంటే అంత నచ్చలేదు..కనుక పాతిపెట్టేసా :)

Day 205 - 230712 - From Jabong


ఈ మధ్య online షాపింగ్ పిచ్చి పట్టుకుంది నాకు. అమ్మకి గిఫ్ట్ కొందామని jabong సైట్ కి వెళ్లి గిఫ్ట్ తో పాటు వేరే వస్తువులు కూడా కొనేసాను. సేఫ్ గానే వచ్చాయి :)

Day 204 - 220712 - పచ్చందనమే పచ్చదనమే


కలుపు మొక్కలయితే మాత్రం ఏం, వీటి వలన పరిసరాలకి ఎంత అందమొచ్చిందో కదా!

Day 203 - 210712 - ప్రియమయిన వసంత


ఈ ఫోటో నేను తీసినది కాదు, కానీ నాకెంతో నచ్చింది, అందుకే కొంచెం ఎడిట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నా :)

Day 202 - 200712 - కొబ్బరి బొండాలు



మా వాడి రుచులు తెగ మారిపోతూ వుంటాయి..ఒకప్పుడు కొబ్బరి నీళ్ళు తాగమంటే ఆమడ దూరం పారిపోయేవాడు కాస్తా ఈ మధ్య అందులో straw వేయించుకుని తాగుతున్నాడు :)

Day 201 - 190712 - నెమలీకల విసనకర్ర




చిన్నప్పుడు స్కూల్ లో ఎవరి దగ్గర ఎక్కువ నెమలి ఈకలు వుంటే వాళ్ళు అంత గొప్ప. పుస్తకాల్లో ఎంతో అపురూపంగా దాచుకునేవాళ్ళం, అలా దాస్తే పిల్లలని పెడుతుందని నమ్మేవాళ్ళం..

Day 200 - 180712 - డ్రైవర్ పండు


మా వాడు పెద్దయ్యాక ఏమవుతాడో తెలీదు కానీ ఇప్పుడయితే ఏ బండి ఎక్కితే దాని డ్రైవర్ ని అని చెప్పుకుంటున్నాడు :)

Day 198 - 160712 - Random pic - Flowers

పువ్వుల రంగు భలే నచ్చేసింది నాకు.

Day 197 - 150712 - కాదేదీ ఫోటో కి అనర్హం


ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయడానికి ఫోటోల కోసం నేను చెట్లు, పుట్టలు, మనుషులు, వస్తువులు, నింగీ, నేలా, నీరు, నిప్పూ వీటితో పాటు జంతువుల వెంట కూడా పడుతున్నాను. కోళ్ళు, కుక్కలు, పిట్టలు లాంటివే కాదు నేను అస్సలు ఇష్టపడని reptiles వెంట కూడా పడుతున్నా :(

Day 196 - 140712 - పండు గాడి హుండీ


ఇంట్లో ఎక్కడ చిల్లర, నోట్లు కనిపించినా తెచ్చి ఇందులో వేసేస్తాడు. ఎందుకు అంటే బొమ్మలు కొనుక్కోడానికి అని చెప్తాడు.

Day 195 - 130712 - కనకాంబరాలు


మొన్న మొన్నటి దాకా  వేసవి ఎండలకి తలలు వాల్చేసి నీరసించిపోయిన ఈ కనకాంబరం చెట్లు ఇప్పుడు కురుస్తున్న తొలకరి వానలకి  కొత్త ఉత్సాహంతో తెగ సంతోషం గా పూలు పూసేస్తున్నాయి. వాసన వుండవు అన్న మాటే కానీ వీటిని మరువంతో కలిపి మాల కట్టుకుని పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది.

Wednesday, July 11, 2012

Day 194 - 120712 - ఱ - గుఱ్ఱం

హమ్మయ్య, ఇంతటి తో నా తెలుగు అక్షరమాల (అ - ఱ) థీమ్ పూర్తయ్యిందోచ్! ఈ థీమ్ లో చాలా రోజులు archived ఫొటోస్ పెట్టాను (ఫోటోలు తీయడానికి సబ్జక్ట్స్ దొరక్క, నాకు తీరిక లేక కూడా)...

Day 182 - 300612 - భ - భంగిమ


నా ఫోటోలలో నాకెంతో ఇష్టమయినది ఈ ఫోటో :) హంపి వెళ్ళినప్పుడు తీసినది.

Day 181 - 290612 - బ - బహుమతి



నాకు బహుమతులు ఇవ్వడమంటే ఎంత ఇష్టమో, తీసుకోవడం కూడా అంతే ఇష్టం. ఈ బాగ్ నా స్నేహితురాలు జ్యోతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చింది.

Thursday, June 28, 2012

Day 180 - 280612 - ఫ - ఫలహారము


మసాలా వడలు (మా ఊరి స్పెషల్ - చుట్టాలొస్తే ఇవి ఉండాల్సిందే..మామూలు గారెలకి మినప్పప్పు నాలుగయిదు గంటలు నానపెట్టాలి కదా, దీనికయితే పచ్చి సెనగపప్పు వాడతారు, అరగంట నానితే చాలు..అందుకే త్వరగా అయిపోతుంది)

Wednesday, June 27, 2012

Day 179 - 270612 - ప - పరివారము



సకుటుంబ సపరివార సమేతం (నాన్న, ఆయన అన్నదమ్ములు, వారి వారి కుటుంబాలు- కొందరు మిస్సింగ్
) - 2007 నాటి సంక్రాంతి కి నాన్న సొంతూరు అయిన ఆళ్లగడ్డ దగ్గరి పల్లెటూరులోని ఇంట్లో తీయించుకున్న ఫోటో

Day 174 - 220612 - త - తరంగిణి


తరంగిణి అంటే నది అని అర్ధం.

Day 173 - 210612 - ణ - భరిణ



'ణ' తో మొదలయ్యే పదాలు ఏవీ తెలీదు నాకు..అందుకే ఈ పదం వాడి ఫోటో పోస్ట్ చేస్తున్నా.

Day 172 - 200612 - ఢ - ఢంకా



ఢంకా నేనెక్కడి నుండి తీసుకురానూ? అందుకే నా చేతివాటం చూపించా :)

Monday, June 18, 2012

Day 170 - 180612 - ఠ - ఠావు


వత్తు ట (ఠ) తో మొదలయ్యే పదాలు ఏమీ తెలీలేదు, అందుకని ఆ వత్తు ట (ఠ) కి ఒక దీర్ఘం ఇస్తే 'ఠా' అయ్యి దాంతో  ఠావు వస్తుంది కాబట్టి అది పోస్ట్ చేస్తున్నా :) చిన్నప్పుడు స్కూల్ లో త్రైమాసిక, అర్ధ సంవత్సర (quarterly, half-yearly) పరీక్షలకి ఎవరి  ఠావు లు వాళ్ళే తెచ్చుకోవాలి అని చెప్పేవారు. అప్పుడు కొనుక్కునేవాళ్ళం ఇవి. ఒక్కోటి పావలా వుండేది. ఇప్పుడసలు అమ్ముతున్నారో లేదో?

Day 168 - 160612 - ఞ - జ్ఞాపకాలు


ఈ 'ఞ' అనే అక్షరం వత్తులలో వాడతారు. ఉదాహరణకి సంజ్ఞ, విజ్ఞానము, ప్రజ్ఞ, జ్ఞాపకాలు ఇలాంటి పదాల్లో అన్నమాట.

Day 167 - 150612 - ఝ - ఝరి


ఈ ఫోటో ఎప్పుడో అయిదేళ్ళ క్రితం UK లో ఒక సారి ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు తీసినది. ఝరి అంటే జలపాతం (Info from telugu dictionary)