Pages

Day 116 - 250412 - చేబ్రోలు లో నందీశ్వరుడు


ఈ ఫోటో పోయిన ఏడాది ఫిబ్రవరి లో  చేబ్రోలు వెళ్ళినప్పుడు తీసాను :)

Day 115 - 240412 - Weekly dose of Greens



పండు గాడు పొట్టలో వున్నప్పుడు నా ఒంట్లో ఐరన్ లెవెల్స్ బాగా తగ్గాయి (8 - 9 కి అలా వచ్చేసాయి). అప్పుడు మా డాక్టర్ నాకు బాగా క్లాసు పీకింది. అప్పటి నుండి వారం లో కనీసం మూడు రోజులు ఆకు కూరలు తినడం మొదలుపెట్టాను. ఒకప్పుడు పాల కూర, తోట కూర తప్ప వేరేవి ఏవీ వండగలిగే దాన్ని కాదు, పేర్లు కూడా తెలిసేవి కావు..ఇప్పుడయితే పాల కూర, తోట కూర తో పాటు గోంగూర (ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర), చుక్క కూర, చిర్రి కూర, మెంతి కూర, పొన్నగంటి ఆకు, మొలగాకు, మునగాకు, అవిశాకు అబ్బో ఎన్నెన్ని తెల్సో నాకు :) మా అయన 'ఇలా ఆకులు తినీ తినీ మేకవయిపోతావు' అని ఎంత వెక్కిరించినా పట్టించుకోట్లేదు సరి కదా తనకీ, పండు గాడికి కూడా తప్పనిసరిగా తినిపిస్తున్నా. ఒంట్లో ఐరన్ శాతం బాగుంటే చాలా జబ్బులు రాకుండా వుంటాయిట.

Day 114 - 230412 - ఈత విన్యాసం



ఈ రోజు మొదటి సారి పండు గాడిని పూల్ లో దించాము. నేను స్విం చేస్తా నువ్వు పో పో అని ఒకటే నెట్టేసాడు. 'పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం' లా ఉండింది  వాడి పరిస్థితి నా పరిస్థితీ ను :)

Saturday, April 21, 2012

Day 112 - 210412 - నాకు దక్కని భాగ్యం...



అందుకే కదా అంటారు 'అసలు కన్నా వడ్డీ ముద్దు' అని :)

Friday, April 20, 2012

Day 111 - 200412 - Ad gimmicks


ఇంకో రెండు నెలలో స్కూల్స్ తెరిచే టైం అవుతుండటం తో కొత్త admissions కోసం రోజూ పేపర్స్ లో ఒకటే ads . ఇది చదివి నవ్వాపుకోలేకపోయాను (AC గురించిన మేటర్).

మా వాడిని స్కూల్ లో చేర్చడానికి పోయిన నవంబర్లో నాలుగయిదు స్కూల్స్ చూసాము. వాళ్ళు నా నంబర్ అడిగితే ఇచ్చాను. ఒక వారం నుండి వాళ్ళు నాకు ఫోన్ చేసి అడగడం, బాబు ని మా స్కూల్ లో చేర్చండి, అవి వున్నాయి, ఇవి వున్నాయి, అవి చెప్తాం, ఇవి చెప్తాం అని. మేము ఏ స్కూల్ లో చేర్చాలో డిసైడ్ అయిపోయాము అని చెప్పి పెట్టేసా :) ఆ మధ్య ఒక కథలో పదో క్లాసు పిల్లలని తమ తమ colleges లో చేర్చడానికి కాలేజీ యాజమాన్యం వాళ్ళు PRO లని పెట్టుకుని ఇల్లిల్లూ తిప్పి offers ఎర చూపిస్తారని చదివాను . ఇప్పుడు ప్లే క్లాసు పిల్లలకి కూడా గాలం వేసేయ్యాలని చూసేస్తున్నారు :(

Thursday, April 19, 2012

Day 110 - 190412 - Lamp post


లాంప్ పోస్ట్ ని ఫోటో తీసి దాన్ని పికాసలో ఇష్టమొచ్చినట్టు మారిస్తే ఇలా అయ్యింది :)

నిన్న నాకో గుడ్ న్యూస్ తెల్సింది. చాలా చాలా సంతోషంగా వున్నానోచ్!

Monday, April 16, 2012

Day 107 - 160412 - కొత్త కారు


ఎట్టకేలకి మా నాన్న పన్నెండేళ్ళ తర్వాత కారు కొన్నారు. 2000 సంవత్సరం లో కొన్న మాటిజ్ తుక్కు తుక్కు అయినా సరే వదలకుండా పన్నెండేళ్ళు లాగించేసారు. ఇక అది మా పండు గాడికి ఆడుకునే బొమ్మ అయిపోయాక చేసేదేమీ లేక అమ్మేసి ఈ కొత్త కారు కొన్నారు. విన్న వాళ్ళందరూ "హమ్మయ్య, ఇన్నాళ్ళకి ఆ మాటిజ్ కి మోక్షం దక్కింది" అంటున్నారు :P
మరి మా జెన్ కి మోక్షం ఎప్పుడో? అన్నట్టు దీని వయసు ఎనిమిదేళ్ళు. మా మామగారు వాడుకున్నంత కాలం బాగుండింది.మా అయన చేతికొచ్చాక మాత్రం మర్యాద రామన్న సినిమా లో సునీల్ సైకిల్ పరిస్థితే దానిది. పాపం :( 

Day 105 - 140412 - మందు బాబుల కోసం..



ఈ పాక ఎదురుగా ఒక పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ వుంది. అందులో ఒక ఫ్లాట్ లో ఉంటున్న ఆయన వీకెండ్స్ స్నేహితులతో కలిసి మందు పార్టీ లని ఎంజాయ్ చేయడానికి ఈ పాక కట్టించుకుని, దాంట్లో అన్ని హంగులూ  (AC తో సహా) పెట్టించుకున్నాడట. Hmmm , ఎవరి ఆనందం వారిది.

Day 104 - 130412 - పక్షులు


గిన్నె కోళ్ళు, బాతులు, కోడి పుంజు, కోడి పెట్టలు, పేరు తెలీని ఇంకో కొత్త రకం కోడి ఇలా నానా జాతుల పక్షులని ఒకేసారి చూసేసరికి ఫోటో తీయాలనిపించింది.

Wednesday, April 11, 2012

Day 102 - 110412 - First batchmates



ఫోటో ని ఫోటో తీసి పోస్ట్ చెయ్యడం కరెక్ట్ కాదు, కానీ ఈ రోజు వేరే ఫొటోస్ ఏమీ తీయలేదు, పైగా ఇదొక milestone కాబట్టి గుర్తుగా బ్లాగ్ లో పోస్ట్ చేద్దామనిపించింది :)

Day 101 - 100412 - Fisrt Progress Report


ఈ రోజు స్కూల్ కి వెళ్లాను అయ్యగారి ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం. ఈ సంవత్సరం ప్లే క్లాసు కి మూడు నెలలు వెళ్ళాడు. వచ్చే ఏడాది కూడా ఇదే క్లాసు. హైపర్ యాక్టివ్, అల్లరి పిల్లాడు అన్న కామెంట్స్ తో మొదటి రిపోర్ట్ చేతికొచ్చింది :)




Day 99 - 090412 - Help :)


మార్కెట్ నుండి కూరగాయలు తెస్తే మా పండుగాడు అన్నీ చక్కగా బాగ్స్ లో, బుట్టల్లో సర్దిస్తాడు :D

Day 99 - 080412 - చిట్టి పొట్టి లడ్డూలు



పండు గాడి కోసం చేసిన నువ్వులు-బెల్లం ఉండలు , మినప సున్నుండలు. నువ్వుండలు బాగానే కుదిరాయి కానీ మినప సున్నుండలు మాత్రం సరిగ్గా రాలేదు. ప్రతి సారీ అమ్మనో, అమ్మమ్మనో ఏమడుగుతాం లే అని నేనే చేసుకుంటున్నా ఈ మధ్య. పైగా వాడి ముందే వండి వార్చితే కొంచెం ఆసక్తి కలిగి తింటాడని ఆశ :)

Saturday, April 7, 2012

Day 98 - 070412 - కొత్త పుస్తకాలు


అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే నేను చేసే పనేంటంటే పుస్తకాల అలమర తీసి కొత్త పుస్తకాలు ఏమొచ్చాయో చూడటం. పెద్దికి బోల్డన్ని బుక్స్ రివ్యూ కోసం ఇస్తుంటారు, అవన్నీ తను చదివేసి ఊరికి పంపిస్తుంది, అలా మన చేతికి చిక్కుతాయన్నమాట :) నేను జనవరి లో కొన్న పుస్తకాలు ఇంకా పూర్తి చెయ్యలేదు కానీ వీటి మీద పడిపోయాను ముందు. మన దగ్గర వుండే పుస్తకాలు ఎప్పుడయినా చదువుకోవచ్చు, వేరే వాళ్ళ పుస్తకాలు ముందు చదివేస్తే ఒక పని అయిపోతుంది కదా.

Friday, April 6, 2012

Day 97 - 060412 - Likes


అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వుండే ఈ బుద్ధుడి బొమ్మ నాకు చాలా ఇష్టం.

Wednesday, April 4, 2012

Day 95 - 040412 - మల్లెల మాల



వేసవి రాగానే గుర్తొచ్చేవి మల్లె పూలు, తాటి ముంజెలు, మామిడి పండ్లూను. మల్లెలు మాత్రమే దొరుకుతున్నాయిప్పుడు, తాటి ముంజెలు, మామిడి పండ్లకి  ఇంకా టైం కాలేదు. ఈ మల్లె పూలు మామయ్య వాళ్ళ తోటలో పూసినవి.

@Sushma..Once again ;)

Day 94 - 030412 - వెన్నెల్లో పడకలు





స్వచ్చమయిన గాలి పీలుస్తూ, వెన్నెల వెలుగులో ఆరుబయట పడుకుంటే ఆ మజానే వేరు. చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్య నన్ను అలా పడుకోబెట్టి కథలు చెప్పేవారు. ఇప్పుడు పండు గాడి వంతు :) చుక్కలని, చందమామ ని చూస్తూ నిద్రలోకి జారుకోవడం, గుడిలో నుండి మంద్రస్థాయిలో విన్పించే ఘంటసాల గారి భక్తి పాటలు వింటూ మేల్కుని, కళ్ళు తెరిచీ తెరవగానే పచ్చని కొబ్బరి చెట్టు ని చూడటం..స్వర్గం ఇంతకంటే బాగుంటుందా?

Day 92 - 010412 - భజన బ్యాచ్



అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి తిరణాల మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రెండు రోజులూ పక్క ఊరి నుండి భజన చేసే వాళ్ళని పిలిపిస్తారు. అప్పట్లో అయితే ఇరవయ్ ముప్పయ్ మంది వచ్చేవారు. ఇప్పుడు అయిదారుగురు కంటే ఎక్కువ మంది రావట్లేదు. వాళ్ళతో పాటు ఊర్లో పిల్లలు, యువకులు కల్సి చేస్తున్నారు. చిన్నప్పుడయితే వాళ్ళతో పాటు నేనూ గజ్జె కట్టి భజన చేసేదాన్ని :)

Day 91 - 310312 - పిల్లల కోడి


అమ్మమ్మ వాళ్ళింట్లో నల్ల కోడిపెట్ట, మచ్చల కోడిపెట్ట వున్నాయి. రెండూ గుడ్లు పెట్టి పిల్లలని చేసి వాటిని వెంట తిప్పుకుంటూ తెగ తిరిగేస్తున్నాయి ఇల్లంతా. ఎంత ముద్దోచ్చేసాయో. నల్ల కోడి, దాని పిల్లలు ఫోటోకి దొరకలేదు.

Day 90 - 300312 - ఈవెనింగ్ స్నాక్స్



సజ్జ చక్క, గోధుమ కజ్జికాయ, కారప్పూస :)

"అది కడుపా కండవిల్లి చెరువా" అని ఇల్లేరమ్మ కథల్లో సుశీల వాళ్ళ అమ్మ అన్నట్లు మా అమ్మ అన్నదీ అంటే అనదూ మరి?